ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన జిల్లా అదనపు కలెక్టర్

హుజూరాబాద్, ఆగస్టు 20:
కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మ ఆదర్శ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న మైనర్ రిపేర్ పనులను పరిశీలించారు. సమావేశ మందిరం అవసరాన్ని, గ్రిల్స్, మెట్లు, ఫ్యాన్లు, విద్యుత్ సంబంధిత మరమ్మతుల వివరాలను కళాశాల ప్రిన్సిపాల్ వి. ఆంజనేయరావు వివరించారు.
విద్యార్థులకు మీటింగ్ హాల్ అవసరమని ప్రిన్సిపాల్ తెలియజేయగా, అనంతరం స్టాఫ్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఐడి కార్డులు ఉచితంగా పంపిణీ చేశారు. విద్యార్థులు క్రమంగా తరగతులకు హాజరవుతూ ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని అదనపు కలెక్టర్ సూచించారు.
కళాశాల ఆవరణలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య ఆధ్వర్యంలో చెత్త తొలగింపు, పిచ్చిమొక్కల నిర్మూలన, 250 మొక్కల నాటకం చేపట్టారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్, ఎంపీడీవో టి. సునీత, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యలను కళాశాల ప్రిన్సిపాల్ శాలువాలతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో లెక్చరర్లు కే. సుగుణ, ప్రసాద్, జీ. తులసీదాస్, కె.వి. వాసుదేవరావు, కే. మురళీమోహన్, జై విజేందర్ రెడ్డి, మల్లారెడ్డి, సుహాసిని, లైబ్రేరియన్ రాజేశం, వెంకటరమణ, రాజేందర్, రహీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
