ప్రజా ఉద్యమాల్లో చిరస్మరణీయుడు కామ్రేడ్ చెన్నమల్ల నర్సయ్య చంద్రన్న
సిపిఐ (ఎం.ఎల్) ప్రజా పంథా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
దోపిడి, పీడన, అణచివేతలేని సమానత్వ సమాజ స్థాపన కోసం జరిగే పోరాటాల్లో కామ్రేడ్ చెన్నమల్ల నర్సయ్య చిరస్మరణీయుడిగా వెలగొందుతాడని సిపిఐ (ఎం.ఎల్) ప్రజాపందా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ చంద్రన్న, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి లు తెలిపారు.
నేడు నల్లపెల్లి మండలం నారక్కపేట గ్రామంలో సిపిఐ (ఎం.ఎల్) ప్రజా పంథా నర్సంపేట డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ చెన్నమల నర్సయ్య ప్రధమ వర్ధంతి సభ జిల్లా కార్యదర్శి చిర్ర సూరి అధ్యక్షతన జరిగింది.
సభ ప్రారంభానికి ముందు కామ్రేడ్ చెన్నమల్ల నర్సయ్య స్మారకార్థం నిర్మించిన స్థూపం వద్ద కామ్రేడ్ చంద్రన్న జెండా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అమరవీరులను స్మరిస్తూ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.
అనంతరం సభ జరిగింది ఈ సభకు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరై మాట్లాడారు.
నీతి, నిజాయితీ, నిస్వార్థంతో ప్రజల తలలో నాలుకలగా
కామ్రేడ్ చెన్న మల్ల నర్సయ్య మెదిలారని గుర్తు చేశారు. పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం తుదికంఠ పరితపించాడన్నారు.
నారక్కపేట సర్పంచిగా ప్రజలందరికీ నిస్వార్ధంగా ప్రజాసేవ చేశాడన్నారు. చెన్న మల్ల నర్సయ్య స్ఫూర్తితో ప్రజలంతా ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం.ఎల్) ప్రజా పంథా ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు కామ్రేడ్ పూనేం ప్రభాకర్ ,నల్లబెల్లి మాజీ ఎంపీపీ బానోత్ సారంగపాణి, సిపిఐ ఎం.ఎల్ జోనల్ కమిటీ కార్యదర్శి ఈర్ల పైడి, సొసైటీ చైర్మన్ మురళి, సొసైటీ డైరెక్టర్ శ్రీనివాస్ గుప్తా, కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ,ప్రజా పంథా జిల్లా నాయకులు మైదంపాణి, అడ్డూరి రాజు,బాబురావు, జి. రవి, ధార లింగన్న, బిచ్చ, జవహర్లాల్ ,పి.డి.ఎస్.యు. రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. నరసింహారావు, చెన్న మల్ల చైతన్య, కిరణ్, ఆలోచన తదితరులు పాల్గొన్నారు. అనంతరం చిన్నమల్ల నర్సయ్య స్మృతి గీతాలు ఆవిష్కరించారు. ప్రజా కళాకారులు రాజేందర్, సుమన్ ,కరీంనగర్ కళా బృందం రాసి పాడిన పాటలు ప్రజలను ఆకట్టుకున్నాయి.
