పెబ్బేరు హైస్కూల్ ఆంజనేయ స్వామి దేవస్థానంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా
పెబ్బేరు: శ్రీరామనవమి సందర్భంగా పెబ్బేరు పట్టణంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హైస్కూల్ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, సీతారాముల విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొని వీరంపేట ఆంజనేయ స్వామి దేవస్థానానికి తరలించారు.
అక్కడ కళ్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ పవిత్ర కార్యక్రమంలో పెబ్బేరు పట్టణ హిందూ బంధువులు, హిందూ జాగృతం సభ్యులు, అనేక భజన బృందాలు పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేశారు. పట్టణవ్యాప్తంగా ఉత్సాహ వాతావరణం నెలకొంది.
