పెద్దపల్లి కలెక్టరేట్లో ఆత్మహత్యాయత్నం కలకలం

పెద్దపల్లి :పెద్దపల్లి కలెక్టరేట్ ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం ఉదయం కలకలం రేగింది. కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేటకు చెందిన సతీష్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఎదుట ఈ ఘటన జరగడంతో అక్కడికి వచ్చిన ప్రజలు, అధికారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
సమాచారం ప్రకారం– కిష్టంపేట ఉన్నత పాఠశాలలో తాత్కాలిక స్వీపర్‌గా పనిచేసిన సతీష్ తండ్రి విధి నిర్వహణలో పాము కాటు వల్ల ప్రాణాలు కోల్పోయాడు. తండ్రి మరణం తరువాత ఉద్యోగాన్ని తనకు ఇవ్వాలని పలుమార్లు అధికారులను కోరినా స్పందన లభించకపోవడంతో సతీష్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో కలెక్టరేట్లో పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించగా అక్కడి సిబ్బంది వెంటనే అడ్డుకున్నారు.
యువకుడిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో కలెక్టరేట్లో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. అధికారులు విషయాన్ని పరిశీలిస్తున్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
