
ఖమ్మం: ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో శనివారం పురాతన బుద్ధ విగ్రహం బయటపడింది. కోలేటి నాగేశ్వరరావు అనే రైతు పొలంలో ఉపాధి కూలీలు మట్టిని తవ్వుతున్న క్రమంలో పాలరాతితో తయారు చేసిన బుద్ధ విగ్రహం వెలుగులోకి వచ్చింది.
రైతు తెలిపిన వివరాల ప్రకారం, క్రీ.పూ. 1వ శతాబ్దం నుండి క్రీ.శ. 3వ శతాబ్దానికి చెందిన విగ్రహంగా భావిస్తున్నారు. ఈ విగ్రహంతోపాటు మరో రెండు శిలలు కూడా లభ్యమయ్యాయి. లభ్యమైన అన్ని పురావస్తువులను స్థానిక పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు.
పురావస్తు శాఖ ఈ ఘటనపై పరిశీలన ప్రారంభించింది. గ్రామస్తులు ఈ విగ్రహాన్ని పూజ్యంగా పరిగణిస్తున్నారు.
