
టేకుమట్ల, జూన్ 26(zindagi9news): టేకుమట్ల మండలంలోని ఏంపేడు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ కొలిపాక రాజయ్య తండ్రి కొలిపాక దాస్ అకాల మరణ వార్త తెలుసుకొని, మాజీ ఎమ్మెల్యే గండ్ర రమణ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
అలానే, మాజీ ఎంపీటీసీ సట్ల కొమురయ్య తల్లి సట్ల అమృతమ్మ మృతి నేపథ్యంలో, గండ్ర రమణ రెడ్డి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
ఈ పరామర్శ కార్యక్రమాల్లో టేకుమట్ల మండల అధ్యక్షుడు సట్ల రవి గౌడ్, మాజీ ఎంపీపీ బందేల నరేష్, ఆకునూరి తిరుపతి, మాజీ ఎంపీటీసీ పింగిలి వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచులు ఉద్దమారి మహేష్ యాదవ్, నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్, బిలాకంటి ఉమేందర్ రావు, పొన్నం చంద్రయ్య, గువ్వాడి లక్ష్మణ్, లింగంపల్లి ప్రభాకర్ రావు, చిలకాని శంకర్, రవీందర్ పాల శంకర్, మమ్మద్ అబ్జల్, మారం లింగారెడ్డి, దేవేందర్ పటేల్, బాబు, రవి తదితరులు పాల్గొన్నారు.
