
పట్టపగలే దొంగతనం – విలువైన ఆస్తి పత్రాలు, రూ.2 లక్షల నగదు మాయం
జిందగీ9న్యూస్, అక్టోబర్ 24 (వైరా నియోజకవర్గ రిపోర్టర్: రమునాయక్):
జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామంలో పట్టపగలే జరిగిన దొంగతనం కలకలం రేపింది. గత మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగి చావు బతుకుల్లో ఉన్న బానోత్ కబీర్దాస్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు చొరబడి విలువైన ఆస్తి పత్రాలు, రూ.2 లక్షల నగదు దొంగిలించారు.
కబీర్దాస్ మరియు బానోత్ లింగాల మధ్య గత ఎనిమిదేళ్లుగా భూమి వివాదం కొనసాగుతోంది. ఈ వివాదం నేపథ్యంలో కబీర్దాస్ పురుగుల మందు తాగాడు. ఇందుకు బాధ్యులని భావించిన ఐదుగురిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఆయన ఫిర్యాదు చేసిన రెండో రోజే ఇంట్లో దొంగతనం జరగడం అనుమానాస్పదంగా మారింది.
ప్రస్తుతం బానోత్ కబీర్దాస్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
