
నల్గొండలో జాగృతి హోర్డింగులు తొలగింపు పట్ల తీవ్ర ఆగ్రహం
ప్రజల్లో కవితక్కకు వస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్ నేతలు వణుకుతున్నారు
— జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్
నల్గొండ జిల్లాలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన ‘జనం బాట’ కార్యక్రమం పట్ల ప్రజల్లో విశేష స్పందన లభిస్తోందని, ఆ ప్రజా మద్దతు చూసి కాంగ్రెస్ నేతల గుండెల్లో వణుకు పుడుతోందని కరీంనగర్ జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు.
నల్గొండ పట్టణంలో కవితక్క స్వాగతార్థం ఏర్పాటు చేసిన జాగృతి హోర్డింగులు, ఫ్లెక్సీలను రాత్రికి రాత్రే తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. ఇది ప్రభుత్వ దివాలా ధోరణికి నిదర్శనమని విమర్శించారు.
కవితక్క ‘జనం బాట’ కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లాలో ప్రజలతో మమేకమై, ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, గత మరియు ప్రస్తుత ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతున్నారని, ప్రజల సూచనలు, సలహాలను స్వీకరిస్తూ జాగృతి బలోపేతానికి కృషి చేస్తున్నారని తెలిపారు.
“ఫ్లెక్సీలు, హోర్డింగులు తొలగించినంత మాత్రాన కవితక్క ప్రజల మనసుల్లో ఏర్పరచుకున్న స్థానం ఎవరు చెరిపివేయలేరు,” అని గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
