తెలంగాణ తొలి ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన BRS నేతలు
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా 101 మొక్కలు నాటిన పెద్దపల్లి నియోజకవర్గ నేతలు
పెద్దపల్లి: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ బొల్లం భూమేష్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా పెద్ద కాల్వల కెసిఆర్ స్థలంలో 101 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
“తెలంగాణ సమగ్ర అభివృద్ధికి కేసీఆర్ నేతృత్వమే కారణం”
పెద్దపల్లి నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష మాట్లాడుతూ:
“తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కేసీఆర్ పోరాట ఫలితమే. అప్పటి నుండి నేటి వరకు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారు. రాబోయే తరాలకు కూడా కేసీఆర్ నాయకత్వం అవసరం.
“కాంగ్రెస్ పాలనలో రైతులపై అన్యాయం జరుగుతోంది. వారి చేతికి గొలుసులు వేసి జైల్లో పెడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తుందంటే, అది కేసీఆర్ మాత్రమే” అని పేర్కొన్నారు.
“మేము నాటిన ఈ మొక్కలు వృద్ధి చెందేంత వరకు కేసీఆర్ అభివృద్ధి కొనసాగుతుంది. ఆయన ఆనవాళ్లను చెరిపేస్తామంటూ కాంగ్రెస్ నాయకులు విర్రవీగినా, ఆయన వారసత్వాన్ని ఎవరూ తుడిచిపెట్టలేరు” అని ఉష అన్నారు.
ఈ కార్యక్రమంలో ఓదెల మండలం ZPTC గంట రాములు యాదవ్, మాజీ మార్కెట్ డైరెక్టర్ సలేవేన రాములు, మాజీ ఎంపీటీసీ కాల్వల రవి, చిన్న కాల్వల ఎంపీటీసీ గుర్రం సంపత్, అలాగే పలువురు BRS నేతలు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
