
డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం
జమ్మికుంట, ఫిబ్రవరి 24: మోటారు వాహనాల డ్రైవర్ల కోసం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్నట్లు జమ్మికుంట టౌన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలిపారు. ఉదయం 11 గంటలకు జమ్మికుంట పట్టణంలోని వినాయక ఫంక్షన్ హాల్లో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో హెవీ గూడ్స్ వాహన డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, ట్రాక్టర్ డ్రైవర్లు పాల్గొని ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకోవచ్చు అని,పరీక్షల్లో అర్హులుగా తేలిన వారికి ఉచిత కళ్లజోడులు కమిషనర్ చేతుల మీదుగా పంపిణీ చేయబడతాయి.డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
డ్రైవర్ల ఆరోగ్య భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.
