వరంగల్, ఏప్రిల్ 29 (Zindagi9news) : కాకతీయ యూనివర్సిటీ ఆంగ్ల విభాగానికి చెందిన పరిశోధకుడు గద్దల ప్రేమ్ కుమార్ డాక్టరేట్ గౌరవం సాధించారు. “మల్టీకల్చరలిజం ఇన్ నీల్ బిసుందత్ ఫిక్షన్” అనే అంశంపై చేసిన వివరణాత్మక పరిశోధనకు ఆయనకు డాక్టరేట్ మంజూరైనట్టు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ తెలిపారు.
ఆయన పరిశోధనకు ఆంగ్ల విభాగ ప్రొఫెసర్ ఎం. ప్రభాకర్ పర్యవేక్షకుడిగా ఉన్నారు. ఈ పరిశోధన సమయంలో ప్రేమ్ కుమార్ జాతీయ, అంతర్జాతీయ స్థాయి సెమినార్లలో పలు పరిశోధనా పత్రాలు సమర్పించారు.
వరంగల్ జిల్లా ఖిలా వరంగల్‌కు చెందిన గద్దల ప్రేమ్ కుమార్ ప్రస్తుతం సీకేఎం కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టరేట్ సాధించిన ప్రేమ్ కుమార్‌ను యూనివర్సిటీ ప్రొఫెసర్లు, పరిశోధక విద్యార్థులు, సహచర ఉద్యోగులు అభినందించారు.
