జయశంకర్ భూపాలపల్లి జిల్లా, టేకుమట్ల: ఆదివారం రోజున రాత్రి 10 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. గిద్దెముత్తరం గ్రామానికి చెందిన పంచిక పవన్ (19), స్నేహితులతో కలిసి టేకుమట్లలో మద్యం సేవించి తన మోటార్‌సైకిల్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా రాఘవాపూర్ గ్రామ శివారులో అదుపుతప్పి చెట్టును ఢీకొనగా తలకు తీవ్రగాయమై, అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు టేకుమట్ల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటనపై టేకుమట్ల ఎస్సై స్పందిస్తూ, “ప్రజలు మైనర్లకు బైక్ ఇవ్వకూడదు. అలాగే, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చు” అని సూచించారు.
సామాజిక బాధ్యత:
ఈ ప్రమాదం యువత హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాల్సిన అవసరాన్ని, అలాగే మద్యం సేవించి వాహనాలు నడపడం ఎంత ప్రమాదకరమో మరోసారి రుజువు చేసింది.
