కేంద్ర ప్రభుత్వం విద్యారంగంపై కక్షపూరితంగా వ్యవహరిస్తుంది
కేంద్ర ప్రభుత్వానికి కానరాని విద్యావ్యవస్థ
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల ఎవరికి లాభం
ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ
జూలూరుపాడు:కేంద్ర బడ్జెట్లో తెలంగాణ విద్యా రంగానికి తీరని అన్యాయం జరిగిందని ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గూగులోతు వంశీ అన్నారు. అలాగే వారు మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దేశ విద్యారంగానికి మోడీ ప్రభుత్వం మొండి చేయి చూపిందని అన్నారు. విద్యకు మరింత కార్పొరేట్ ప్రైవేటీకరణ దగ్గరగా చేస్తున్న విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టింది విద్యారంగానికి బడ్జెట్లో నామమాత్రంగా 0.2% మాత్రమే పెరిగింది. 1247.39 కోట్ల నుండి 12500 మాత్రమే విద్యారంగానికి నిధులు పెరిగాయి. ఈ నిధులు విద్యారంగా అభివృద్ధికి ఏ మాత్రం ఇప్పటికే పాఠశాలలో విద్యకు దేశంలో నిధులు కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యకు 73008 కోట్ల నుండి 78572 కోట్ల నిధులు కేటాయించారు. 500 కోట్లు మాత్రమే పెంచారు ఇలా బడ్జెట్ పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే విధంగా ఈ బడ్జెట్ ఉందని వారు అన్నారు. విద్య కోసం నామాత్రంగానే 2025-2026 బడ్జెట్ కనిపిస్తుందని 50077.95 కోట్లకు కేవలం 5%శాతం మాత్రమే పెంచారు అని అన్నారు. కాబట్టే విద్యా రంగానికి నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. గత పది సంవత్సరాల అందులో తెలంగాణకు కేంద్ర బడ్జెట్ చాలా అన్యాయం చేసిందని కేవలం తెలంగాణ పట్ల మొండి వైఖరి నిరసిస్తూ తెలంగాణ కావాల్సిన వాటా కేటాయింపు కాకుండా అన్యాయం చేసిందని అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సంవత్సరాలు పూర్తయింది కానీ
విభజన హామీలు చట్టంలో ఉన్న వంటి విద్యారంగనికి కేటాయించాలని జిల్లాకు ఒక నవోదయ పాఠశాల త్రిబుల్ ఐటీ, గిరిజన యూనివర్సిటీ లాంటి ఒక్క హామీలు ఆనాడు ఎన్నికల్లో విభజన హామీలు చెప్పినట్టే నేటికీ పది సంవత్సరాల పూర్తి కావస్తా ఉన్న ఇప్పటివరకు బడ్జెట్లో ప్రవేశపెట్టకుండా తెలంగాణకు కేంద్రప్రభుత్వం అన్యాయం చేసిందని అన్నారు.కేంద్ర ప్రభుత్వంపై ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి మండిపడ్డారు
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
