జిల్లా ఉత్తమ హెల్త్ ఎడ్యుకేటర్‌గా అడిదెల మోహన్ రెడ్డి సత్కారం

జమ్మికుంట, ఆగస్టు 15 – కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ ఎడ్యుకేటర్‌గా విధులు నిర్వహిస్తున్న అడిదెల మోహన్ రెడ్డి, 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా ఉత్తమ హెల్త్ ఎడ్యుకేటర్‌గా ఎంపికయ్యారు. ఈ అవార్డును జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వెంకటరమణ ప్రశంసా పత్రంతో అందజేశారు.
సమయపాలన, క్రమశిక్షణతో అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై గ్రామీణ, పట్టణ ప్రజలకు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పించడంలో ఆయన విశిష్ట సేవలు అందించారు. హన్మకొండ జిల్లా శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామానికి చెందిన మోహన్ రెడ్డి, గత 35 ఏళ్లుగా వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో వివిధ హోదాలలో విధులు నిర్వర్తిస్తూ ఉన్నతాధికారుల ప్రశంసలు, పలు అవార్డులు అందుకున్నారు.
ఈ విజయంపై డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డా. చందు, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డా. సనా జావేరియా, వావిలాల పీఎచ్సీ వైద్యులు, సిబ్బంది మోహన్ రెడ్డిని అభినందించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
