
వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో కార్యక్రమం
జమ్మికుంట, మే 16 (zindagi9news):జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని జమ్మికుంట పట్టణంలో వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. వైద్యాధికారి డాక్టర్ రాజేష్ నేతృత్వంలో వైద్య సిబ్బంది పట్టణంలోని ప్రధాన వీధులలో ర్యాలీ నిర్వహిస్తూ, ప్రజల్లో డెంగ్యూ పై అవగాహన పెంచారు.

“డ్రై డే ఫ్రైడే – డ్రై డే ట్యూస్ డే”, “డెంగ్యూ అంతం మనందరి పంతం”, “పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత” వంటి నినాదాలతో ప్రజలను చైతన్యపరిచారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ –
“డెంగ్యూ జ్వరాన్ని కలిగించే ఏడిస్ దోమలు ఎక్కువగా నీరు నిలిచే ప్రదేశాలలో నివాసిస్తాయి. చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే మలేరియా, చికెన్ గున్యా లాంటి వ్యాధులనూ నివారించవచ్చు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచడం, నిలువ నీటి నిల్వలను తొలగించడం ముఖ్యం. దోమ తెరలు, దోమతరిపే మందులు ఉపయోగించడం వల్ల రక్షణ కలుగుతుంది” అని పేర్కొన్నారు.
ఈ ర్యాలీలో ఎంఎల్హెచ్పీ వైద్యులు డాక్టర్ ఫర్హానుద్దీన్, డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ కార్తీక్, డాక్టర్ సంధ్య, డాక్టర్ చందన, డాక్టర్ మహోన్నత పటేల్, డాక్టర్ హిమబిందు, డాక్టర్ విజయ్ కుమార్, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, సూపర్వైజర్లు రత్నకుమారి, అరుణ, కుసుమ కుమారి, సదానందం, ఆరోగ్య సిబ్బంది నరేందర్, సరళ, వనజ, మంజుల, సాజిదా పర్వీన్, వాణి, రజిత, రాధ మరియు ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
