తైబజర్ వేలం పాట దక్కించుకున్న పోరండ్ల రమేష్
జమ్మికుంట: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో తైబజర్ ఫీజులు వసూలు చేయుటకు నిర్వహించిన వేలం పాటలో పరకాలకు చెందిన పోరండ్ల రమేష్ విజేతగా నిలిచారు. ఆయన రూ.40,61,000 లక్షలకు వేలం దక్కించుకున్నారని మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ, తైబజర్ ఫీజుల వసూలు కోసం పలు మండలాల నుండి 23 మంది డిమాండ్ డ్రాఫ్ట్ (DD) తీసుకుని వేలం పాటలో పాల్గొన్నారని పేర్కొన్నారు. వాటిలో పోరండ్ల రమేష్ అత్యధిక ధరకు వేలం గెలుచుకున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మెనేజర్ జి. రాజి రెడ్డి, ఆర్ ఐ భాస్కర్,సదానందం, అనిల్, తదితరులు పాల్గొన్నారు.
