
చెక్ డ్యామ్ ధ్వంసం – ఇసుక మాఫియా దుశ్చర్యపై కేసు నమోదు
పెద్దపల్లి/జమ్మికుంట: మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన శనివారం కలకలం రేపింది. ఈ విషయం పై జమ్మికుంట పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇరిగేషన్ శాఖ ఉపకార్యనిర్వాహక ఇంజనీర్ పాలకుర్తి రవి జమ్మికుంట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
తేదీ 21న రాత్రి 10 గంటల సమయంలో తనుగుల గ్రామ శివారులోని మానేరు వాగుపై గల చెక్ డ్యామ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని తెలిపారు. ఈ ఘటనలో చెక్ డ్యామ్ సుమారు 90 మీటర్ల మేర కూలిపోయింది.
డ్యామ్ వల్ల దాదాపు 1000 ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఈ నిర్మాణం విలువ రూ.3 కోట్లు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
స్థానికుల ఆరోపణల ప్రకారం, ఇసుక అక్రమ రవాణాకు అడ్డంకిగా మారుతున్న చెక్ డ్యామ్‌ను ఇసుక మాఫియా ముఠా ఉద్దేశపూర్వకంగా కూల్చివేసిందని పేర్కొన్నారు. చెక్ డ్యామ్ ధ్వంసంతో సాగునీరు నిలిచిపోయే ప్రమాదం ఉందని, భక్తులకు కూడా ఇబ్బందులు వున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.
– Zindagi9News
