
టీ కేఫ్‌లు స్మోకింగ్ అడ్డాగా… యువత తప్పుదారి!
ప్రాంతంలో పెరుగుతున్న టి కేఫ్‌ల సంఖ్యతో పాటు కొత్త సమస్య తెరపైకి వచ్చింది. టీ తాగేందుకు మాత్రమే ఏర్పాటు చేసిన ఈ స్థలాలు, ఇప్పుడు యువతకు సిగరెట్ సేవనం చేసే కేంద్రాలుగా మారిపోతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. సాయంత్రం సమయంలో టీ కేఫ్‌ల బయట గుంపులుగా నిలబడి స్మోకింగ్ చేసే యువకులు, మైనర్ బాలురు కూడా సిగరెట్ పట్టుకుని కనిపించడం స్థానికుల్లో అసహనాన్ని రేకెత్తిస్తోంది.
పక్కనే వెళ్లే ప్రజలకు పొగతాగడం వల్ల అసౌకర్యం, పిల్లల ముందే ధూమపానం జరగడం వంటి సంఘటనలు తరుచూ జరుగుతున్నాయని నివాసితులు చెబుతున్నారు. టీ పేరుతో యువత వ్యసనాలకు గురవుతున్నారని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
“టీ కేఫ్‌కు టీ తాగడానికి వెళ్లి స్మోకింగ్ నేర్చుకుంటున్నారు. ఇలా కొనసాగితే పరిస్థితి మరింత దారుణం అవుతుంది” అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో స్థానికులు పోలీసు, ఎక్సైజ్ శాఖలు వెంటనే చర్యలు తీసుకోవాలని, మైనర్లకు సిగరెట్ అమ్మే కేఫ్‌లపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. టీ కేఫ్‌ల వద్ద విచ్చలవిడిగా జరుగుతున్న ధూమపానం నియంత్రించకపోతే యువత ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదముందని ప్రజలు చెబుతున్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
