గ్రామ గ్రామాన రేషన్ కార్డుల జాతర
వనపర్తిలో ఒకే రోజు 2014 రేషన్ కార్డుల పంపిణీ

వనపర్తి, ఆగస్టు 1 (జిందగీ 9 న్యూస్):
వనపర్తి నియోజకవర్గ పరిధిలోని పెబ్బేరు మండలం మరియు మున్సిపాలిటీకి చెందిన లబ్ధిదారులకు శుక్రవారం రోజున 2014 కొత్త రేషన్ కార్డులను అందజేశారు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి. పెబ్బేరు మండల కేంద్రంలోని సహారా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొత్తం 2014 మందికి రేషన్ కార్డులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత పదేళ్లుగా BRS పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా మంజూరు కాలేదని విమర్శించారు. నేడు ఇందిరమ్మ రాజ్యంలో గ్రామ గ్రామాన కొత్త రేషన్ కార్డులు, ఇండ్లు పంపిణీ చేయడంతో పండగ వాతావరణం నెలకొందన్నారు.
నిరుపేదల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రస్తుతం జరుగుతున్న సన్న బియ్యం పంపిణీ, మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఆర్టీసీ బస్సుల కొనుగోలు, పెట్రోల్ బంకులు, ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ల్లో మహిళలకు అధికారం ఇవ్వడం వంటి కార్యక్రమాలు ఇందుకు నిదర్శనంగా పేర్కొన్నారు.
ఇంకా మాట్లాడుతూ, గత పదేళ్ల BRS పాలనలో అభివృద్ధి కంటే కబ్జాలకే ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు. వనపర్తి నియోజకవర్గానికి ఇప్పటికే వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని, మరో రూ.300 కోట్ల పనులను త్వరలో ప్రారంభించనున్నట్టు తెలిపారు.
వనపర్తికి తాను ఎమ్మెల్యే అయినట్లే, కేటీఆర్ కు ఎమ్మెల్యే స్థాయి లేనందున ఆయన చేసిన విమర్శలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధిపై ఎలాంటి చర్చకైనా తాము సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే మేఘారెడ్డి కేటీఆర్కు సవాల్ విసిరారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా పౌర సరఫరా శాఖాధికారి విశ్వనాథ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమోదిని రెడ్డి, వైస్ చైర్మన్ విజయ్ వర్దన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గంధం రాజశేఖర్, వెంకట్ రాములు యాదవ్, రంజిత్ కుమార్, సాగర్, దయాకర్ రెడ్డి, సురేందర్ గౌడ్, యాపార్ల రాం రెడ్డి, రమణ, సత్య రెడ్డి, రాములు యాదవ్, షకీల్, వేణు, లక్ష్మన్ తదితర నాయకులు, వార్డు ఇన్చార్జీలు, మాజీ సర్పంచులు, తహసీల్దార్లు, అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
