బోయినిపల్లి : గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. మండలంలోని గ్రామాలలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడమే లక్ష్యంగా పనులు చేపట్టినట్లు చెప్పారు. గ్రామాల్లో సమస్యలు ఉంటే వాటిని తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
బోయినిపల్లి మండలంలోని గుండన్నపల్లి గ్రామంలో శనివారం రూ.8 లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ రహదారి శంకుస్థాపన చేశారు. అనంతరం స్తంభంపల్లి గ్రామంలో నిర్మించనున్న సుగ్రీవ ఆలయానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభం చేశారు. ఆలయ నిర్మాణానికి అవసరమైన అనుమతులు, మంత్రుల సహకారం ద్వారా వేగంగా పనులు పూర్తయ్యేలా చూస్తానని తెలిపారు.
ఇక ఐసిడీఎస్ ఆధ్వర్యంలో కన్నం ప్రభాకర్‌కు జీవనోపాధి కోసం రూ.50,000 చెక్కు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. అనంతరం గ్రామస్థులు ఎమ్మెల్యేను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, మండలంలోని 23 గ్రామాల్లో రూ.3.10 కోట్లు విలువైన సీసీ రోడ్ల నిర్మాణానికి మంజూరయ్యాయి అని తెలిపారు. అలాగే కొండపోచమ్మ ఆలయానికి రూ.50 లక్షలతో రహదారి నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. బోయినిపల్లి-కోదురుపాక డబుల్ రోడ్ నుండి మాడల్ స్కూల్ వరకు రూ.25 లక్షలతో సీసీ రహదారి నిర్మించామన్నారు.
ఇంకా CRR గ్రాంట్, ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా రూ.1.60 కోట్లు మంజూరయ్యాయని, త్వరలో మండలంలోని అన్ని గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు పూర్తవుతాయని వెల్లడించారు. చివరగా అక్కడ ఉన్న చిన్నారులతో ఆప్యాయంగా మమేకమయ్యారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, యువజన నాయకుడు కౌడగాని వెంకటేష్, సేస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, మాజీ ఎంపీటీసీలు, గ్రామ సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు అక్కనపల్లి ఉపేందర్, ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, సంబలక్ష్మి రాజం, ఏనుగుల కనకయ్య, మమ్మద్, కొప్పుల నగేష్, రాజేష్, ప్రవీణ్ గోపాల్, మెరుపుల మహేష్, మధు లక్ష్మణ్, నాగుల వంశీ, అజయ్, రమేష్, మైపాల్ రెడ్డి, పిట్టల రమేష్, నల్ల మోహన్, రఫీఖాన్ తదితరులు పాల్గొన్నారు.
