మహిళా విద్య కోసం జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమయి.
ఇల్లాలు చదువు ఇంటికి వెలుగు
నేటి మహిళలకు సావిత్రిబాయి ఆదర్శం
గార్దియాన్ స్కూల్ ప్రిన్సిపాల్ మహమ్మద్ అంకూస్
జమ్మికుంట : మహిళా చదువు ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందని వంద సంవత్సరాల క్రితమే
విద్య యొక్క ప్రాముఖ్యాన్ని గుర్తించి, జీవితాంతం అందుకోసం కృషి చేసిన మహనీయురాలు
స్ఫూర్తి ప్రదాత సావిత్రిభాయి పూలే అని అటువంటి మహానీయురాలి జయంతి సందర్బంగా
ఘన నివాళులు అర్పిస్తూ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్న స్త్రీ మూర్తులను పూలమాలలతో సన్మానించి సావిత్రిబాయి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మహమ్మద్ అంకూస్
సావిత్రి బాయి స్పూర్తితో..
ఆడపిల్లను చదవనిద్దాం.. ఎదగనిద్దాం అని అన్నారు. సావిత్రిబాయి సేవలను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం ఆమె జయంతి సందర్భంగా అధికారికంగా మహిళ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రకటించడం మహిళలకే గర్వకారణమని అన్నారు.ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులు పానుగంటి సౌజన్య, స్వప్న, మమత, శ్రీలత, అలేఖ్య పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
