జమ్మికుంట పట్టణంలో శుక్రవారం రోజున సావిత్రిబాయి పూలే జయంతి పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ని ఘనంగా నిర్వహించిన ఎంఈఓ హేమలత.ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే యొక్క సేవలు మరియు విద్యార్థులను ఆమె తీర్చిదిద్దిన విధానాన్ని ఆనాటి కాలంలో సంఘంలో ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించిన ధైర్యాన్ని గురించి తెలిపారు . ప్రతి ఒక్క మహిళ ఉపాధ్యాయురాలు కూడా సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో విద్యార్థులను ఉన్నత శిఖరాల వైపున నడిపియాలని కోరారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మండలం మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
