బోయినిపల్లి; ఫిబ్రవరి 17 : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి లో సోమవారం రోజున తెలంగాణా జాతిపిత కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని స్థానిక బిఆర్ఎస్ నాయకులతో కలసి కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన చొప్పదండి మాజీ శాసన సభ్యులు సుంకె రవిశంకర్.ఈ సందర్భంగా సుంకె రవిశంకర్ మాట్లాడుతూ పదేండ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని అన్నారు.
కానీ పదేండ్లలో జరిగిన అభివృద్ధి గడిచిన సంవత్సర కాలంలో చాలా నష్టానికి గురవుతుందని విమర్శించారు.కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలని ఆశాభావం వ్యక్తం చేశారు.కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు.
