గురువారం రోజున కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంట నందు ప్రపంచ నేలల దినోత్సవం, ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు ప్రారంభోత్సవం మరియు గ్రామ నవ నిర్మాణ సమితి స్వర్నోత్త్వవాల కార్యక్రమం నిర్వహించారు.
ముఖ్య అతిథి చైర్మన్ తెలంగాణ వ్యవసాయ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమ సంఘాలు మరియు ప్రకృతి వ్యవసాయం & యాంత్రీకరణ వ్యవసాయ రంగం లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. రైతులు అందరూ సమీష్టిగా ఐక్యం తో ఒక్కటై ఈ ప్రకృతి వ్యవసాయం ను కనుమరుగవకుండా వుండేలా కృషి చేయాలని తెలిపారు. వ్యవసాయ మరియు అనుబంధ రంగాలు కూడా దీనిలో భాగం అవాలని తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ అనుబంధ శాఖకు అనువదించేలా మరియు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు & రైతు సహకార సంఘాల రైతులు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వర్గం లో ముఖ్యమైన ప్రతినిధులుగా వుండి మీ యొక్క అమూల్యమైన, విలువైన సూచనలు ఇవ్వాలని కోరారు.మానవాళికి ప్రకృతి ప్రసాదించిన సహజ వనరుల్లో నేల ఒకటి. నేల మనకు తల్లితో సమానం. కనుక నేలతల్లి, భూమాత అని సంభోదిస్తాం. నేల ఎన్నో రకాల సూక్ష్మ జీవులకు ఆవాసాన్ని కల్పిస్తుంది. కానీ ప్రస్తుతం వ్యవసాయ రంగం పరంగా నేల తల్లిని కాపాడుకోవడం భవిష్యత్తూ తరాల వారికి సారవంతమైన నేలలను అందిచడం అందరి బాధ్యత అని తెలిపారు. ఆ దిశగా వెళ్ళల్లంటే రైతులు ప్రకృతి వ్యవసాయ వైపు మొగ్గు చూపాలని కోరారు.
డా. షేక్ ఎన్ మీరా( ATARI డైరక్టర్, జోన్ X, హైదరాబాద్) మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ అభివృద్ధి మరియు రైతుల సంక్షేమం దేశానికి వన్నె తెచ్చే విధంగా 3 -4 సంవ” ఏ విధంగా కార్యాచరణ నిర్వహించాలో దృష్టి సాధించాలని కోరారు. అలాగే ఐక్య రాజ్య సమితి అనే సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం డిసెంబర్ 5 వ తేదిన జరుపుకునే ప్రపంచ నేలల దినోత్సవంలో భాగంగా ఈ సంవత్సరం మట్టి గణాంకాల సేకరణ, పర్యవేక్షణ, నిర్వహణ పై ధృష్టి పెట్టాలనే నేపధ్యం పై రైతులతో పాటు ప్రతి ఒక్కరికి నేల మరియు దాని యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కలిగి ఉండాలని కోరారు.అంతే కాకుండా రైతులకు ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన రావడం కోసం దేశ వ్యాప్తంగా 731 కృషి విజ్ఞాన కేంద్రాలు మరియు 30000 కృషి సఖీలు ( మహిళలు) ద్వారా శిక్షణ ఇచ్చే విధంగా 10000 జీవ వనరుల కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే పంట దిగుబడికి అతి ముఖ్యమైన సేంద్రియ కర్భన శాతం ప్రకృతి వ్యవసాయం ద్వారా పెరుగుతుందని తెలిపారు. ఇటువంటి గొప్ప ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రం లో మొట్ట మొదటి సారిగా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ప్రారంభించడం ఆనందదాయకం గా వుంది అని హర్షం వ్యక్తం చేశారు.
వ్యవసాయం మరియు రైతు సంక్షేమ సభ్యులు యం.భవాని రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం తరుపున కూడా రైతులకు సహాయం అందించి వాళ్ళని చైతన్య పరచాలని ప్రకృతి వ్యవసాయం చేసే విధంగా ప్రోత్సాహించాలని తెలిపారు.
అలాగే పి విజయ్ గోపాల్ రెడ్డి, కెవికే ప్రధాన కార్యదర్శి మరియు డా ఎన్ వెంకటేశ్వర్ రావు, సీనియర్ సైంటిస్టు & హెడ్ మాట్లాడుతూ రైతులను చైతన్యపరుస్తూ ప్రకృతి వ్యవసాయం వైపు ఆసక్తి చూపే విధంగా ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్ట్ ను గోమాత, భూమాత, భరత మాత అనే నినాదంతో 3 సంవత్సరాల పాటు 2 (జమ్మికుంట & సైదాపూర్) మండలాలలోనీ 8 గ్రామాలలో 6340 మంది రైతులతో 10000 ఎకరాలలో ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. దీనిలో భాగంగా ప్రకృతి వ్యవసాయం లో ఎక్కువ పెట్టుబడి లేకుండా ఆవు మూత్రం, ఆవు పేడ, పచ్చి రొట్టె ఎరువులతో నేల సారాన్ని పెంచడం & ప్రకృతి సిద్దమైన కాషాయాలు వంటివి ఉపయోగించడం వల్ల తెగుళ్ళు& పురుగుల నియంత్రణ తో పాటు రసాయన ఎరువులు, పురుగు మందులు లేకపోవడం వల్ల నాణ్యమైన పంటను పండించడం వల్ల ఆరోగ్యం ను మెరుగుపరుచుకునే దిశగా ముందుకు వెళ్ళే విధంగా ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించబోతునట్లు తెలిపారు.అలాగే గ్రామ నవ నిర్మాణ సమితి సంస్థ ను 1974 లో స్వర్గీయ శ్రీ పరిపాటి జనార్ధన్ రెడ్డి గారు స్థాపించి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంస్థ స్వర్ణోత్సవాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సంస్థ యాభై సంవత్సరాలలో కృషి విజ్ఞాన కేంద్రం మరియు ఇతర ప్రాజెక్ట్స్ ద్వారా గ్రామిణాభివృద్ధి, వ్యవసాయం, ఆరోగ్యం & విద్య మొదలగు వాటిపై అవగాహనా కల్పిస్తూ సేవ చేయడం జరుగుతుంది. 
అలాగే ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా వున్న ఆదర్శ రైతులు వారి అనుభవాలను & సలహాలను తోటి రైతులకు తెలియచేయడం జరిగింది మరియు అభ్యుదయ రైతులకు సత్కరించుకోవడం జరిగింది. అలాగే జీవ వనరుల కేంద్రానికి భూమి పూజ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి జిల్లాస్థాయి వ్యవసాయ మరియు అనుబంధ రంగాల అధికారులు, కేవికే శాస్త్రవేత్తలు & సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ పి. కుమారస్వామి, డాక్యుమెంటేషన్ ఆఫీసరు రమాకాంత్, ఫీల్డ్ స్టాఫ్ మరియు ఇతర ప్రజా ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
