నిజామాబాద్ :ఓబీసీ మోర్చా రాష్ట్రశాఖ పిలుపు మేరకు,కామారెడ్డి బిసి డిక్లరేషన్ వెంటనే అమలుపర్చాలని, తహసీ ల్దార్ కార్యాలయం వద్ద బీసీల సమగ్ర కులగణన, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచాలని,
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం,ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో,నిరసన కార్యక్రమకు ముఖ్య అతిథిగా మాదాసు స్వామి యాదవ్ పాల్గొన్నారని పత్రికా ప్రకటనలో తెలియజేశారు.అలాగే దక్షణ మండల తహసీల్దార్ మరియు ఉత్తర మండల తహసీల్దార్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎన్నికల్లో హామీలో భాగంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్,కామారెడ్డి బహిరంగ సభలో ప్రకటించిన విధంగా, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని, హామీని అమలు చేయాలని, బిజెపి,ఓబీసీ మోర్చా డిమాండ్ చేస్తుందన్నారు.అలాగే ప్రతి సంవత్సరం 20వేల కోట్ల బడ్జెట్ బీసీ లకు కేటాయిస్తామున్న హామీ అమలు కాలేదని,గత సంవత్సరం ఈ సంవత్సరం కలిపితే, మొతం 40వేల కోట్లు రూపాయలు ఈ బడ్జెట్ సమయంలో ప్రకటించాలని, బిజెపి ఓబీసీ మోర్చా డిమాండ్ చేస్తుందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వాగ్దానాలను అమలుపరచకుంటే,బీజేపీ ఓబీసీ మోర్చా గ్రామ స్థాయి నుండి, బీసీలందరిని ఏకతాటిపై తీసుకోవచ్చి,ఉద్యమల ద్వారా బీసీలకు నాయ్యం జరిగే వరకు పోరాటం చేస్తాం అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కోడూరు నాగరాజు,అర్బన్ అసంబ్లీ కన్వీనర్ దుద్దోల్ల గిరిబాబు,కార్పొరేట్ మెట్టు విజయ్,మండల అధ్యక్షులు మరెడ్డి సురేష్, చిన్నాకరి నరేష్, పట్టేవార్ మారుతీ,రాజకుమార్,నగర నాయకులు గడ్డం రాజు, ముత్యాలు, రంజిత్, గణేష్, వినోద్, శ్రీను,విజయ్, ఓబీసీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
