వినయంలో నక్క.. అవినీతిలో అనకొండ..
అభివృద్ధిలో ఆటంకం ఐకాన్ ఫారా ముష్ మేక వన్నె పులి సునీల్ రావు
అలాంటి వ్యక్తిని ఆలింగనం చేసుకొని బరితెగించిన బండి సంజయ్..
సునీల్ రావు, గంగుల, బండి సంజయ్ మ్యాచ్ ఫిక్సింగ్..
కరీంనగర్ ప్రజలారా మేల్కొండి..
గాంధీ కుటుంబంపై అవాకులు చవాకులు పేల్చితే నాలుక చీరేస్తాం..
బాధ్యతారహిత్యంగా మాట్లాడడం ఆయన హోదాను తగ్గించుకోవడమే..?
గౌరవప్రదమైన హోదాలో ఉండి ఇలాంటి మాటలేనా మాట్లాడేది..?
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు
కరీంనగర్ జనవరి 27: వినయంలో నక్క , అవినీతిలో అనకొండ , వికాసం విషయంలో విషపురుగు , అభివృద్ధికి ఆటంకం అయినా ఐకాన్ ఫారామూష్ మేక వన్నె పులి సునీల్ రావు అని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు మండిపడ్డారు. ఇలాంటి ఘనత వున్న సునీల్ రావును ఆలింగనం చేసుకొని బండి బరితెగించారని విమర్శించారు.
సోమవారం వెలిచాల రాజేందర్రావు మీడియాతో మాట్లాడుతూ
కరీంనగర్ ప్రజలకు సునీల్ రావుకు గంగులకు జరిగిన పంపకాలు వారి నోటి నుండే వినే అవకాశం కల్పించినందుకు సునీల్ రావు కు ధన్యవాదాలు తెలుపుతున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్, బిజెపి మధ్యలో మ్యాచ్ ఫిక్సింగ్ ల సినిమా తెరమీదకి తెచ్చినందుకు కోటి కృతజ్ఞతలు అని తెలిపారు.
కే ఎన్ఆర్( డిఎంఎఫ్1)
సునీల్ రావు, గంగుల అవినీతి పంపకాలు, దోపిడి మ్యాచ్ ఫిక్సింగ్ కేఎన్ఆర్ -(2 సీక్వెల్) లో సునీల్ రావు , గంగుల , బండి సంజయ్ ల మ్యాచ్ ఫిక్సింగులు అని ఆరోపించారు.
అనకొండ తోడేలు, నక్క మూడు కలిసి సహవాసం చేస్తే ఏం జరుగుతుందో, ఎలా పీక్కుతున్నాయో ఎన్ని పంచాయతీలు వస్తాయో అదే ఈ సినిమా ద్వారా బయటపడిందన్నారు.
ఈ నిజాయితీ ఏంది అనకొండ ను నేను ఎక్కడైనా మేయడం మింగేయడమే కదా నాకు తెలిసిన పని అన్నట్టు సునీల్ రావు ఆలోచన అని మండి పడ్డారు. నాకు నా వాటా అందేంతవరకు కరీంనగర్ తల్లినైన అమ్మకానికి పెట్టే వైఖరితో ఉన్న నేను అనకొండ మరియు నక్కతో పాటు తోడేలు కు కూడా వాటా అందాల్సిందే గంగుల అనుకుంటున్నాడని విమర్శించారు.
కరీంనగర్ ప్రజలారా మేల్కోండి. అనకొండ, తోడేలు మరియు నక్కలను తరిమి కోట్టాలని రాజేందర్ రావు పేర్కొన్నారు. అడవిలోనికి ఇంకొక అవకాశం వారికి ఇవ్వకుండా మనల్ని మోసం మరియు ద్రోహం చేయకుండా ఈ రక్త పిపాసుల్ని పర్మనెంట్ గా ప్రజలు తరిమి కొట్టాలని సూచించారు.
మున్సిపల్ కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి స్థాయికి ఎదిగిన బండి సంజయ్ గారి బాధ్యతారహిత వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయాన్నారు. ఒక రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడిగా పనిచేసి, రెండు సార్లు ఎంపీగా గెలిచిన వ్యక్తి మాట్లాడే మాటలా ఇవేనా అని ప్రశ్నించారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ప్రధాని ఆవాస్ యోజన పేరు పెట్టాలని, కొత్త రేషన్ కార్డులపై కాంగ్రెస్ ఫొటోలు పెట్టోద్దంటున్నారు. అలా అయితేనే కేంద్రం డబ్బులు మంజూరు చేస్తుందని.. లేకపోతే ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదంటున్నారు. బండి సంజయ్. ఇంత గౌరవప్రదమైన హోదాలో ఉన్న వ్యక్తి ఇంతలా దిగజారి మాట్లాడతారా అని ప్రశ్నించారు.
కేంద్రప్రభుత్వం… రాష్ట్ర ప్రభుత్వాలకేమీ దానధర్మాలు చేయట్లేదు. పన్నుల వాటా ప్రకారమే నిధులు ఇస్తోంది తప్ప ఒక్క రూపాయైనా అదనంగా ఇస్తోందా.? అని మండిపడ్డారు.
ఇందిరమ్మ పేరే మీకు ఇబ్బందిగా అనిపిస్తే.. మరీ బీజేపీ పూర్వ నాయకుల పేర్లతో పథకాలు ఎందుకు అమలుచేస్తున్నారు కదా అని సవాల్ విసిరారు .? దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన, దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, అటల్ బిహారీ వాజ్ పేయీ జనరల్ స్కాలర్షిప్ స్కీమ్ వంటి పథకాలు మీకు కనిపించట్లేదా.? మరీ వారి పేర్లు ఎందుకు పెట్టారు.? రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు, ఇండ్లకు ఇందిరమ్మ పేరు పెడితే ఎందుకు డబ్బులు ఇవ్వరో మేము చూస్తామని హెచ్చరించారు. పథకాలకు నిధులు బండి సంజయ్ తన ఇంట్లో నుంచి ఇవ్వడం లేదు.. ఇంకోసారి గాంధీ కుటుంబంపై అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదని, నాలుక చీరేస్తామని బండి సంజయ్ ని హెచ్చరించారు.
తెలంగాణ నుంచి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులున్నా ఉపయోగం లేకుండా పోయిందన్నారు.. కనీసం ఒక్క రూపాయైనా రాష్ట్రానికి అదనంగా తెచ్చారా? ప్రజలు ఏ నమ్మకంతో అయితే గెలిపించారో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ విషయం మీద దృష్టిపెడితే బాగుంటుందనీ వెలిచాల రాజేందర్ రావు బండి సంజయ్ కు హితవు పలికారు. బండి నిత్యం గి ఘీంకరించి వల్లించే దేశం, ధర్మం, దైవం, దేవాలయం, దీపం, ధూపం, ధార్మికం అని చెప్పే నీతి బోధన పాటించడం అంటే ఇదేనా అని ప్రశ్నించారు.
