
కరీంనగర్లో ఘనంగా వెలిచాల రాజేందర్ రావు జన్మదిన వేడుకలు
కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. వెలిచాల రాజేందర్ రావు యువసేన జిల్లా అధ్యక్షుడు కాసరపు కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నగర కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా అంజన్ కుమార్ మాట్లాడుతూ రాజేందర్ రావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. పేద ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, అభిమానులు పాల్గొన్నారు.

అదేవిధంగా జన్మదినాన్ని పురస్కరించుకుని టీం వెలిచాల ఆధ్వర్యంలో కొత్తపల్లిలోని ప్రజాభవన్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. వృద్ధాశ్రమాల్లో పండ్లు, బ్రెడ్ పంపిణీ, పేద పిల్లలకు అన్నదానం, దేవాలయాలు–దర్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. నగరంలోని పలు ప్రాంతాల్లో వాడవాడలా కేక్ కట్ చేసి టపాసులు కాల్చి వేడుకలు జరిపారు.
సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా రాజేందర్ రావు ప్రజాసేవ పట్ల నిబద్ధతను చాటారని పాల్గొన్న నాయకులు పేర్కొన్నారు.
