తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఫలితాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడుదల చేయనున్నారు.
ఈ సంవత్సరం మార్చి 5 నుండి 25వ తేదీ వరకు ఇంటర్ పత్రిక పరీక్షలు నిర్వహించబడిన సంగతి తెలిసిందే. ఫలితాల విడుదల కోసం విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
