దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం (World Economic Forum) సదస్సులో పాల్గొనడానికి జ్యూరిచ్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది.
ముఖ్యమంత్రి , మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారుల ప్రతినిధి బృందం జ్యూరిచ్ విమానాశ్రయం చేరుకోగానే అక్కడ స్థిరపడిన తెలుగు వారితో సందడి నెలకొంది. ముఖ్యమంత్రి కి పెద్ద ఎత్తున హాజరై అభినందనలు తెలియజేశారు.
జ్యూరిచ్ విమానాశ్రయంలో రేవంత్ రెడ్డి , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరస్పరం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై వారి మధ్య చర్చ జరిగింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి శ్రీధర్ బాబు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ కూడా ఉన్నారు.

