కరీంనగర్, ఫిబ్రవరి 2 : రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తాను ఎమ్మెల్సీగా గెలిచి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి గిఫ్ట్ గా ఇస్తానని పట్టభద్రులు ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తనపై నమ్మకం ఉంచి పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిందని.. తనకు సహకరించిన ఢిల్లీ పెద్దలకు రాష్ట్ర నాయకత్వానికి రుణపడి ఉంటానని వెల్లడించారు.. ఎమ్మెల్సీ ఎన్నికలకు మరో 23 రోజులే మిగిలి ఉన్నందున ప్రతి కాంగ్రెస్ కార్యకర్తతో మమేకమై ముందుకు సాగుతానని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్తర తెలంగాణ చరిత్రను మార్చే విధంగా ఉండాలని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తన గెలుపులో పాలుపంచుకోవాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని.. ఉచితంగా తాను విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. గత 34 సంవత్సరాలుగా తాను విద్యారంగంలో తెలంగాణ అయితే రాణించానో.. ఏడాది కాలంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు… ఉత్తర తెలంగాణలో కరీంనగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని.. ప్రభుత్వం మెడికల్ కళాశాల మంజూరు చేసిందని మౌలిక సదుపాయాలు మాత్రం మరిచిపోయిందని ఎద్దేవా చేశారు.. గత ఐదు నెలలుగా ఎమ్మెల్సీ పరిధిలోని 42 నియోజకవర్గాలు పర్యటించాలని.. సమస్యలు తన దృష్టికి వచ్చేయని పట్టభద్రుల సమస్యలు పరిష్కరించేందుకు తాను ఎల్లవేళలా ముందుంటానని పేర్కొన్నారు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 55000 ఉద్యోగాలు ఇచ్చి యువతకు భరోసా కల్పించిందని గుర్తు చేశారు… కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ పరిధిలో లా కాలేజ్ తో పాటు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేస్తానని ప్రభుత్వం ప్రకటించడం ఆనందంగా ఉందని అన్నారు.. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అమలుకు కృషి చేస్తారని అన్నారు..ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకార భాస్కర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ , మాజీ కార్పొరేటర్లు చాడగొండ బుచ్చిరెడ్డి, కాశిరెడ్డి శ్రీనివాస్ శ్రావణ్ నాయక్, మునిగంటి అనిల్, ఫహాద్ గండి రవీందర్, వెన్నం రజిత రెడ్డి ,షబానా ,శరణ్య పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
