ఉపముఖ్య మంత్రికి పెబ్బేరు కాంగ్రెస్ నేతల శాలువా సత్కారం

పెబ్బేరు: కొల్లాపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనల కోసం వెళ్తున్న తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లూ భట్టి విక్రమార్కను, నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డా. మల్లూ రవి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిలను శనివారం పెబ్బేరు మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా పెబ్బేరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎద్దుల విజయ్ వర్ధన్ రెడ్డి, పెబ్బేరు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కారపాకుల వెంకటరాములు యాదవ్ నేతృత్వంలో ఈ సత్కార కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ సాగర్, దయాకర్ రెడ్డి, వెంకట రమణ, సురేందర్ గౌడ్, 8వ వార్డ్ ఇంచార్జి జహంగీర్, యుగేందర్, తిప్పాయిపల్లి మహేశ్వర్ రెడ్డి, నాయకులు కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
