
రాచపల్లి గ్రామంలో దొంగతనాల కలకలం
ఇల్లందకుంట , అక్టోబర్ 28 (zindagi9news) : కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం రాచపల్లి గ్రామంలో వరుస దొంగతనాలు చోటుచేసుకున్నాయి. అక్టోబర్ 27 రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రాచపల్లి ZPHS పాఠశాల ఆఫీస్ తాళం పగులగొట్టి, బీరువా తెరిచి ఉంచినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది.
ఈ ఘటనలో ఒక ఖాళీ ల్యాప్‌టాప్ బ్యాగ్ మిస్సైనట్లు తెలిపారు. అలాగే రెండు క్లాస్రూమ్ గదుల తలుపులు పాక్షికంగా డ్యామేజ్ చేయబడ్డాయని పేర్కొన్నారు.

ఇదే సమయంలో గ్రామ బస్టాండ్ పరిసరాల్లో ఉన్న కిరాణా షాప్, టిఫిన్ సెంటర్, సలూన్ షాప్‌ల తాళాలు కూడా పగలగొట్టినట్లు స్థానికులు తెలిపారు. బాధితుడు నారన్న ఫిర్యాదు మేరకు ఇల్లందకుంట పోలీస్ స్టేషన్ ఎస్ఐ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
పోలీసులు గ్రామ పరిసరాల్లో సీసీ కెమెరా ఫుటేజ్‌ను సేకరిస్తూ, దొంగలను గుర్తించే దిశగా దర్యాప్తు చేస్తున్నారు.

