వావిలాలపల్లి, కరీంనగర్ | 02.03.2025
అల్ఫోర్స్ హైస్కూల్ ఆఫ్ జెనెక్స్ట్ 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సందర్భంగా “FUN ‘n’ FROLIC” పేరుతో ఓ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రేకుర్తి స్వాగత్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్య అనేది జీవితానికి గట్టి పునాది అని, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించాలన్నారు.

కార్యక్రమాన్ని సరస్వతి దేవికి పూజతో ప్రారంభించిన డా. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, 10వ తరగతి విద్యార్థులకు ఇది ఓ మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుందని, తాము పాఠశాలలో నేర్చుకున్న విషయాలు జీవితాంతం తోడుంటాయని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, కష్టపడే తత్వం, గురువుల బోధనలను సరిగ్గా పాటిస్తే, భవిష్యత్తులో గొప్ప విజయాలను సాధించగలరని ప్రేరేపించారు.

విద్యార్థులు తమ ప్రతిభను వెలికి తీసుకునేలా ఉపాధ్యాయులు నడిపించే మార్గదర్శకత ఎంతో కీలకమని, విద్యతోపాటు విలువలను అలవరుచుకోవాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు అభివృద్ధికి ఉపాధ్యాయులు చేస్తున్న సేవలను కొనియాడుతూ, విద్యార్ధులకు ఉత్తమ మార్గనిర్దేశం చేసినందుకు ఉపాధ్యాయులను ప్రత్యేకంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల కోసం వినోద కార్యక్రమాలను నిర్వహించి, వారిలో దాగి ఉన్న ప్రతిభను ప్రోత్సహిస్తూ బహుమతులు అందజేశారు.
– Zindagi9News
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
