చిన్నంబావి, వనపర్తి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన మరియు భారీ బహిరంగ సభ వనపర్తిలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన చిన్నంబావి మండల ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళలు మరియు ప్రతి ఒక్కరికీ చిన్నంబావి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.
చిన్నంబావి మండల ప్రజలు సీఎం రేవంత్ రెడ్డికి విశేష ఆదరణను చూపారని, ఈ కార్యక్రమం రాష్ట్ర అభివృద్ధికి మరో ముందడుగుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయాలని ధృఢసంకల్పంతో ముందుకు సాగుతున్నామని అన్నారు.
– Zindagi9News
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
