
బోయినిపల్లి, మే 14(zindagi9news):రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొత్తపేట గ్రామ శివారులో బుధవారం అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్.ఐ) మనోజ్ పట్టుకున్నారు. సంబంధిత అధికార అనుమతులు లేకుండా ఇసుకను రవాణా చేస్తున్నట్టు గుర్తించి, తగిన చర్యలు చేపట్టారు.
అక్రమ రవాణా పై ప్రభుత్వం గట్టిగా వ్యవహరిస్తోందని, ఇలాంటి చర్యలు మళ్లీ జరుగకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్.ఐ మనోజ్ హెచ్చరించారు. ఈ తనిఖీలో ఆయనతో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
