
అకాల అధిక వర్షాల కారణంగా పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు – పరిశీలించిన జూలూరుపాడు మండల ప్రెస్ క్లబ్ సభ్యులు
జూలూరుపాడు, సెప్టెంబర్ 1 (జిందగీ9న్యూస్):
జూలూరుపాడు మండలంలో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామాల వారీగా వరద పరిస్థితులను పరిశీలించి, అధికారులను అప్రమత్తం చేసిన జూలూరుపాడు మండల ప్రెస్ క్లబ్ సభ్యులు ప్రజలకు జాగ్రత్త సూచనలు జారీ చేశారు.
మండల ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప ఇళ్ల వద్దనే ఉండాలని, బయటకు రావాల్సి వస్తే పోలీసుల సహకారంతోనే ముందుకు వెళ్లాలని సూచించారు. అలాగే నీరు నిల్వ ఉన్న ప్రదేశాలను శుభ్రంగా ఉంచాలని, లేదంటే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. “ఆరోగ్యమే మహాభాగ్యం, సంపాదన ఏదైనా ఆరోగ్యంతోనే సాధ్యం” అని ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వీరు నాయక్, గౌరవ సలహాదారుడు బి. రమేష్, ధారావత్ రాము, గౌరవ అధ్యక్షుడు వై. సురేంద్ర, ప్రేమ్ కుమార్, సభ్యులు, వివిధ గ్రామాల సెక్రటరీలు, పోలీస్ మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
