
అంగన్వాడి కేంద్రంలో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు
జమ్మికుంట, మార్చి 2(zindagi9news): జమ్మికుంట పట్టణం లోని కేశవపూర్ అంగన్వాడి కేంద్రంలో సోమవారం నూతన మున్సిపల్ కౌన్సిలర్ ఆధ్వర్యంలో అంగన్వాడి స్థాయి పర్యవేక్షణ మరియు సహాయక కమిటీ ఏర్పాటు చేశారు. కేంద్రంలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు ప్రతిరోజూ వచ్చి పోషకాహారం తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు సంప్రదాయంగా శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 15వ వార్డ్ కేశవపూర్ మున్సిపల్ కౌన్సిలర్ మౌనిక–అనిల్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బైరి సురేష్, అంగన్వాడి టీచర్ శివభారతి, హెల్పర్ సునీతతో పాటు తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కేంద్రం ద్వారా గర్భిణీలు, బాలింతలకు సరైన పోషకాహారం అందిస్తూ ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
