
హుజూరాబాద్:మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో హుజూరాబాద్ మున్సిపాలిటీలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. మూడు రోజుల వ్యవధిలో మొత్తం 30 వార్డుల నుంచి 304 నామినేషన్లు స్వీకరించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.నామినేషన్ల ప్రక్రియలో మొత్తం 189 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు వెల్లడించారు. పార్టీల వారీగా చూస్తే భారతీయ జనతా పార్టీ నుంచి 79, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి 4, కాంగ్రెస్ పార్టీ నుంచి 89, భారత రాష్ట్ర సమితి నుంచి 77 నామినేషన్లు దాఖలయ్యాయి.అలాగే ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, ఇతర నమోదు అయిన పార్టీల నుంచి 16 నామినేషన్లు, స్వతంత్ర అభ్యర్థులుగా 39 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
