హుజురాబాద్ పట్టణంలోని జామ మజీద్ ఈద్గా కబ్రిస్తాన్ కమిటీ అధ్యక్షుడు ముజాహిద్ హుస్సేన్ వారి నివాసంలో గురువారం రోజున ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ముస్లిం యువకులు, మత పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇఫ్తార్ అనంతరం మౌలానా సాబ్ ప్రత్యేక దువా చేశారు.
కార్యక్రమంలో మౌలానా ఇమ్రాన్ సహాబ్, మొహమ్మద్ ముఖిద్ అహ్మద్, మాజీ కౌన్సిలర్ ఇమ్రాన్, ఫసి, మునీరుద్దీన్ తదితర ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
