హుజురాబాద్, ఏప్రిల్ 13: హుజురాబాద్ లారీ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి కె. రాజయ్య, ప్రధాన కార్యదర్శిగా ఎండి మాజీద్ విజయం సాధించారు.
అలాగే వైస్ ప్రెసిడెంట్‌గా ఎండి అహ్మద్, జాయింట్ సెక్రటరీగా సయ్యద్ మునీర్, క్యాషియర్‌గా ఎం. జనార్ధన్ రెడ్డి ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన సభ్యులు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు కె. రాజయ్య, కార్యదర్శి ఎండి మాజీద్ మాట్లాడుతూ, “లారీ డ్రైవర్లు మరియు క్లీనర్ల సమస్యల పరిష్కారానికి మా పాలకవర్గం కట్టుబడి పనిచేస్తుంది. వారి హక్కులను కాపాడుతూ, సంక్షేమాన్ని కళ్ల ముందుంచుకొని నిర్ణయాలు తీసుకుంటాం” అని తెలిపారు.
ఎన్నికల అనంతరం లారీ అసోసియేషన్ సభ్యులు కొత్త నాయకత్వాన్ని శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో లారీ యజమానులు, డ్రైవర్లు, క్లీనర్లు తదితరులు పాల్గొన్నారు.
