సైన్స్ ఫెయిర్ తో విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందుతుంది..
విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు సైన్స్ ఫెయిర్ ఎంతో దోహదపడుతుంది…
శ్రీ చైతన్య స్కూల్ సైన్స్ సైన్స్ ఫెయిర్ ప్రోగ్రాంలో బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి వ్యాఖ్యలు…
సైన్స్ ఫెయిర్ తో విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందుతుందని , విద్యతోపాటు విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక అంశాల్లోని నైపుణ్యాలను వారి ప్రతిభను వెలికి తీసేందుకు సైన్స్ ఫెయిర్ ఎంతో దోహదపడుతుందని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. కరీంనగర్ పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ వావిలాలపల్లి, విద్యారణ్య పూరి బ్రాంచ్ ల లో శుక్రవారం రోజున జరిగిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సైన్స్ ఫెయిర్ లో విద్యార్థుల వైజ్ఞానిక , ఇతర ప్రదర్శనలను గంగాడి కృష్ణారెడ్డి తిలకించి , పలువురు విద్యార్థులతో మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల మేదో సంపత్తిని గుర్తించడానికి కొన్ని సైన్స్ ఫెయిర్ కీలకంగా మారాయన్నారు. వైజ్ఞానిక మేలాల్లో సైన్స్ నమూనా ప్రాజెక్టులు విద్యార్థుల ప్రతిభ, సృజనాత్మకతకు దర్పణంగా నిలుస్తున్నాయన్నారు. ముఖ్యంగా పాఠశాల దశ నుంచి సైన్స్, గణితం సబ్జెక్టుల్లో పట్టు సాధించే విధంగా విద్యార్థులను తయారు చేయడంలో ఈ ప్రదర్శనలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. దేశానికి శాస్త్ర సాంకేతిక వైజ్ఞానాన్ని అందించిన ఎంతోమంది మహానుభావులు ఉన్నారని , ఆర్యభట్ట మొదలుకొని అబ్దుల్ కలాం వరకు ఎంతోమంది ఆ దిశలో కృషి చేశారని , వారి స్ఫూర్తి గా తీసుకొని విద్యార్థులు ముందు కొనసాగాలని ఆయన ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కార్పొరేటర్ కొలగానీ శ్రీనివాస్ , నాయకులు పాదం శివరాజ్ , బండారి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
