తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై బిజెపి కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు నిరాధారణ మాటలను ఖండించిన హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ బి అధ్యక్షులు మొలుగూరి సదయ్య. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ రాష్ట్రం శాసనసభ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పక్షాన పర్యటించి ప్రచారం చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సహకారంతో అభివృద్ధి దశలో పోతుందని ఢిల్లీ ప్రజలతో మాట్లాడడం జరిగింది. దీనిని కరీంనగర్ జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు తప్పుడు ఆరోపణలతో ప్రకటన ఇవ్వడం జరిగింది. హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ బి అధ్యక్షులు మొలుగూరి సదయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పని పార్టీ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమలు చేయడం జరిగింది మరియు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆరు గ్యారంటీలతో ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చి గత ప్రభుత్వం చేసిన లోటును సవరిస్తూ ఆరు గ్యారంటీలతో ముందుకు తీసుకు పోతున్నారు. దేశంలో బిజెపి పార్టీ అప్పుడు హామీలతో ఉదాహరణకు ప్రజల అకౌంట్లో బ్లాక్ మనీ చేస్తానని చెప్పింది వాస్తవం కాదా బిజెపి ఉపాధ్యక్షులు చేసిన తప్పుడు ఆరోపణ ఖండిస్తున్నాను అని కాంగ్రెస్ పార్టీ బ్లాక్ బి అధ్యక్షులు ప్రకటనలో పేర్కొన్నారు.
