
వీణవంక, జూన్ 12 (జిందగీ 9 న్యూస్ ప్రతినిధి): వీణవంక మండలం శ్రీరాములపేట గ్రామంలో గురువారం ‘అమ్మ మాట – అంగన్వాడి బాట’ కార్యక్రమాన్ని అంగన్వాడి కేంద్రం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ స్వర్ణరాణి మాట్లాడుతూ, కేంద్రానికి హాజరయ్యే చిన్నారులకు పోషకాహారం అందించడమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇంగ్లీష్ బోధన కూడా అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా సుమలత, తల్లులు, ప్రీ-స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.
