CC బెడ్ నిర్మాణానికి ప్రాథమిక పరిశీలన – త్వరలో ప్రారంభం
పెబ్బేరు, మే 8 (జిందగీ9న్యూస్): పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ శ్రీ సుంకులమ్మ దేవి ఆలయం అభివృద్ధికి చర్యలు వేగవంతమవుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో CC బెడ్ నిర్మించాలి అనే డిమాండ్‌ను హిందూ జాగృతం సభ్యులు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డికి తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు, మండల కాంగ్రెస్ నాయకులు పంచాయతీరాజ్ AE కార్తీక్‌తో కలిసి ఆలయ ప్రాంగణాన్ని నేడు సందర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధి కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, త్వరలో నిర్మాణ పనులు ప్రారంభించబడతాయని వెల్లడించారు. ప్రజల సహకారంతో ఆలయ పరిసరాలు మరింత శుభ్రంగా, అభివృద్ధి దిశగా మారనున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ వర్ధన్ రెడ్డి, టౌన్ అధ్యక్షులు వెంకట్రాముడు యాదవ్, జిల్లా SC సెల్ మాజీ అధ్యక్షులు గంధం రాజశేఖర్, జిల్లా యువజన నాయకులు రంజిత్ కుమార్, మైనార్టీ నాయకులు MD షకీల్, మండల సీనియర్ నాయకులు అశ్విని సత్యనారాయణ, సత్యనారాయణ రెడ్డి, యుగంధర్ రెడ్డి, భగవంతు నాయుడు, బాలరాజు యాదవ్, హిందూ జాగృతం సభ్యులు వేణు, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు సకాలంలో పూర్తవుతాయన్న నమ్మకాన్ని స్థానికులు వ్యక్తం చేశారు.
