పెబ్బేరు: గంగను దివిలోనుండి భూమికి తీసుకువచ్చిన మహాతపస్వి, మహర్షి శ్రీ శ్రీ శ్రీ భగీరథ మహర్షి జయంతిని పెబ్బేరు పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం సమీపంలో ఉన్న విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. సగర సంఘం పెబ్బేరు శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ జయంతి ఉత్సవాల్లో ప్రముఖులు, సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.అంతకు ముందు భగీరథ మహర్షి విగ్రహానికి పూలమాలలతో అర్చనలు నిర్వహించి, పూజలు చేశారు. సభలో భగీరథ మహర్షి జీవిత చరిత్రను గుర్తు చేస్తూ ఆయన తపస్సు, గంగావతరణం తదితర విశేషాలు వివరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుక సత్యం సాగర్, జిల్లా అధ్యక్షుడు మోడల తిరుపతయ్య సగర, జిల్లా ఉపాధ్యక్షుడు మోడల వెంకటేష్, వనపర్తి టౌన్ అధ్యక్షుడు మురళి సాగర, చంద్రాయుడు వెంకటస్వామి, హిందూ జాగృతి సభ్యులు వేమరెడ్డి, TVS బుజ్జి, హనుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నేతలు సత్యనారాయణ, శివ సాయి, అలాగే సాగర సంగం అధ్యక్షులు గుంటి రాముడు, మండల అధ్యక్షుడు గుంటి శ్రీనివాసులు, బునియాదపూర్ గ్రామ అధ్యక్షుడు, శాఖపూర్ గ్రామ అధ్యక్షుడు, రాజు సగర మరియు అనేక మంది సాగర బంధువులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
