శాతవాహన వర్శిటీలో లా కళాశాలకు బార్ కౌన్సిల్ ఆమోదం
కరీంనగర్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో లా కళాశాల ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కృషి ఫలంగా ఈ నిర్ణయం వెలువడింది.
ఈ విద్యా సంవత్సరం (2025–26) నుంచే అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి.
రెండు సెక్షన్లతో 120 మంది విద్యార్థులకు ఎల్ఎల్.బీ కోర్సు నిర్వహించనున్నారు.
వర్శిటీ వీసీ ప్రొఫెసర్ ఉమేశ్ కుమార్ నేతృత్వంలో బండి సంజయ్ న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ను కలిసి లా కళాశాల అనుమతి కోరారు.
బార్ కౌన్సిల్ వర్చువల్ తనిఖీ చేసి నివేదిక కోరింది. నివేదిక అనంతరం అనుమతి మంజూరు చేయడం విశేషం.
ఈ సందర్భంగా బండి సంజయ్, కేంద్ర న్యాయశాఖ మంత్రి, బార్ కౌన్సిల్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

