కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంటలో పత్తి సాగు పై కిసాన్ మేళా
పత్తి పంటలో అధిక దిగుబడి కోసం అధిక సాంద్రత విధానం అవగాహన
జమ్మికుంట, 22 మార్చి 2025: కరీంనగర్ జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం, జమ్మికుంట లో పత్తి సాగులో అధిక సాంద్రత విధానం పై కిసాన్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వ్యవసాయం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక
ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ “వ్యవసాయం మన దేశానికి ప్రాణాధారం. రైతుల సంక్షేమం కోసం కేంద్రం వివిధ పథకాలను అమలు చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో భారత పత్తికి అధిక డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో పత్తి సాగులో అధిక సాంద్రత విధానం ద్వారా రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందవచ్చు” అని పేర్కొన్నారు.
పత్తి సాగులో అధిక సాంద్రత విధానం – ప్రయోజనాలు
🔹మొక్కల మధ్య దూరం తగ్గించి, ఎక్కువ మొక్కలు నాటడం
🔹తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించడం
🔹గులాబీ రంగు పురుగు ఉధృతి తగ్గించడం
🔹ఒకే సమయంలో పత్తి పండించడం
వ్యవసాయ రంగంలో మహిళలకు అవకాశాలు
డా. షేక్ ఎన్. మీరా (అటారి, జోన్ 10 డైరెక్టర్) మాట్లాడుతూ “నమో డ్రోన్ దీదీ పథకం ద్వారా మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్ లు అందించి శిక్షణ ఇవ్వడం ద్వారా మహిళా రైతులకు ఉపాధి హామీ కల్పిస్తున్నారు” అని వివరించారు.
ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యత
డా. శ్రీలత (ADR, జగిత్యాల) మాట్లాడుతూ “రైతులు వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకొని కొత్త వ్యవసాయ విధానాలను పాటించాలి. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఆచరిస్తే భవిష్యత్తులో మంచి లాభాలను పొందవచ్చు” అని సూచించారు.
నీటి యాజమాన్యం & పంట మార్పిడి
ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా, నీటి సంరక్షణ, పంటల యాజమాన్యం గురించి అవగాహన కల్పించబడింది. “ఒక ఎకరా వరికి కావలసిన నీటితో ఒక హెక్టారు ఆరుతడి పంట పండించవచ్చు. కాబట్టి రైతులు వరి మార్గంలో ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలి” అని శాస్త్రవేత్తలు సూచించారు.
ప్రయోగాత్మక సాగు & రైతుల అభిప్రాయాలు
డా. ఎన్. వెంకటేశ్వర్ రావు (కేవికే, జమ్మికుంట) మాట్లాడుతూ “పురుగు మందులు, రసాయనాలు తగ్గించి, సహజ సిద్ధమైన పద్ధతులతో సాగు చేయడానికి కృషి విజ్ఞాన కేంద్రం విశేషంగా పని చేస్తోంది” అని తెలిపారు.
రైతులు పత్తి పంటలో అధిక సాంద్రత విధానం ద్వారా పొందిన అనుభవాలను పంచుకున్నారు. ప్రయోగాత్మకంగా ఈ విధానం అమలు చేసిన రైతులను అభినందించి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య వ్యక్తులు
• భాగ్యలక్ష్మి (జిల్లా వ్యవసాయ అధికారి)
• ఎన్. వెంకటేశ్వర్ రావు (కేవికే, జమ్మికుంట హెడ్)
• డి. శ్రీనివాస్ రెడ్డి (సస్య రక్షణ శాస్త్రవేత్త)
• జె. విజయ్ (సేద్య విభాగ శాస్త్రవేత్త)
రైతులు, ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు & కేవికే శాస్త్రవేత్తలు
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
