
పెబ్బేరు: హిందూ జాగృతం సభ్యులు మరియు అయ్యవారిపల్లి గ్రామ హిందూ బంధువుల సహాయ సహకారంతో “మన గుడి – మన బాధ్యత” కార్యక్రమం 33వ వారం విజయవంతంగా పూర్తి అయింది. ఈరోజు ఉదయం 6:00 గంటల నుండి 10:00 గంటల వరకు తీపాయిపల్లి గ్రామ శివారు మరియు అయ్యవారిపల్లి గ్రామ శివారులోని అతి పురాతన శివకేశవ ఆలయం మరియు కోనేరులో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు.
ఈ పుణ్య కార్యానికి పాల్గొన్న అయ్యవారిపల్లి హిందూ బంధువులకు, పెబ్బేరు హిందూ జాగృతం సభ్యులకు నిర్వాహకులు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమం హిందూ ధర్మ పునరుజ్జీవానికి చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నదని స్థానికులు అభిప్రాయపడ్డారు.
