పెబ్బేరు జనని హాస్పటల్ వైద్యం కారణమని కుటుంబసభ్యుల ఆరోపణ
పెబ్బేరు: పట్టణానికి చెందిన ఫిరోజ్ భార్య (50) ఇటీవల పెబ్బేరు జనని హాస్పటల్‌కి వైద్యం కోసం వెళ్లగా విషాద ఘటన చోటుచేసుకుంది. ఏప్రిల్ 24న ఆమెను గర్భసంచి సంబంధిత చికిత్స కోసం తీసుకెళ్లగా, హాస్పటల్‌కు చెందిన వైద్యుడు డాక్టర్ ఎన్. జయచంద్ర రెడ్డి ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఆపరేషన్ జరుగుతున్న సమయంలో మహిళకు ఆకస్మికంగా ఫిట్స్ రావడంతో, డాక్టర్ స్వయంగా ఆమెను కర్నూలు మేడి కవర్ హాస్పటల్‌కు అంబులెన్స్‌లో తరలించారు. అక్కడ వైద్యం కొనసాగించినా, కుటుంబసభ్యుల ప్రకారం ఖర్చు ఎనిమిది లక్షల రూపాయల వరకూ వెళ్ళింది. వైద్యం కొనసాగించిన అనంతరం ఆమె గురువారం మృతి చెందారు.
ఈ ఘటనపై స్పందించిన డాక్టర్ జయచంద్ర రెడ్డి, “ఆమెకు మునుపటినుంచే ఫిట్స్ ఉన్నట్టు మాకు తెలియదు. ఆపరేషన్ సమయంలో ఫిట్స్ రావడంతో వెంటనే మేడి కవర్ హాస్పటల్‌కు తరలించాం. వైద్య ఖర్చు మేమే భరించాం,” అని చెప్పారు. మీడియా ప్రశ్నలకు స్పందిస్తూ, “మానవత దృక్పథంతోనే ఖర్చును మేమే భరించాం,” అని పేర్కొన్నారు.
ఈ ఘటనపై ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది. సంబంధిత వైద్య అధికారుల స్పందన, విచారణ కోసం కుటుంబసభ్యులు ఎదురు చూస్తున్నారు.
