నంద్యాల జిల్లా డోన్ మండల పరిధిలోని ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ గాజుల శ్రీనివాసులు (45)గుండెపోటుతో మంగళవారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి నందు మృతి చెందాడు.ఆయన మృతికి డోన్ మోటర్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి టి.శివరాం,నాయకులు ఎస్.సుబ్బారెడ్డి,కె.వెంకటేశ్వర్లు సంతాపం వ్యక్తం చేశారు.బుధవారం ఎర్రగుంట్ల గ్రామంలో జరిగిన మృతుని అంత్యక్రియలలో పాల్గొన్న వారు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.కుటుంబ సభ్యులను పరామర్శించారు.మృతునికి భార్య లక్ష్మీదేవి,ఇద్దరు కుమార్తెలు.అనంతరం వారు మాట్లాడుతూ శ్రీనివాసులు అకాల మరణం బాధాకరమని వారి కుటుంబానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు.డోన్,ఎర్రగుంట్లకు చెందిన నారాయణ,బుగ్గ రాముడు,కిట్టు,మహేష్ తదితర లారీ డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించారు.

Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
